News

టిఆర్ఎస్ ఒక్క ఇల్లైనా నిర్మించిందా:ఉత్తం


తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లైనా నిర్మించిందా అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో నిర్మాణంలో ఉన్న నాలుగు లక్షల ఇళ్లు పెండింగులో ఉండడంతో పేదలు మొండి గోడల మద్య ఉండవలసి వస్తోందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబందించిన బిల్లులు చెల్లించడం లేదని ఉత్తం అన్నారు. ఆ ఇళ్లు పూర్తి అయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందన్న అనుమానంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్వించారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్శిటీ కి ఆహ్వానించడానికి గాను డిల్లీకి వెళతామని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈనెల పదిహేడున కాంగ్రెస్ లో చేరతారని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబందించి అనేక అవకతవకలు జరిగాయని , విచారణ కు కూడా ప్రభుత్వం ఆదేశించింద. ఆ విచారణ ఏమైందో కాని బిల్లులు మాత్రం చెల్లించడం లేదని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.